NLG: నకిరేకల్‌లోని మీసేవ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీనివాస్ గౌడ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మీ సేవ కేంద్రాల నిర్వహణ తీరుపై సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. పట్టణంలో 13 మీ సేవా కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు.