NZB: నవీపేట్ మండల కేంద్రంలో మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న రౌడీ షీటర్ మలావత్ కృష్ణ (39)ను అరెస్టు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం వారం రోజుల జైలు శిక్ష విధించారు. తాగి న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.