MBNR: ఆర్టీసీ సమస్యలపై ‘డయల్ యువర్ RM’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలమూరు రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. నేడు సాయంత్రం 4:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆర్టీసీ సమస్యలు, సూచనల కోసం 99592 26295కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.