KMR: జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు DEC 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ)పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని SP హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించలన్నారు.