SRD: ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల నుంచి వచ్చిన నామినేషన్లు స్వీకరించాలని సంగారెడ్డి జిల్లా ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం రాత్రి సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, స్థానికంగా ఏర్పాటుచేసిన నామినేషన్ల కౌంటర్లను పరిశీలించారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగించాలని సూచించారు. ఇందులో ఎంపీడీవో శారద ఉన్నారు.