PDPL: పెద్దపల్లిలో యునైటెడ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నూతన పట్టణ కార్యవర్గం బాధ్యతలు సోమవారం చేపట్టింది. సందర్భంగా అధ్యక్షుడు మొహమ్మద్ అస్లాం పర్వేజ్, కార్యదర్శి సైఫుల్లా ఖాన్ మాట్లాడుతూ.. మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు ఉపాధి మార్గాలు చూపడంతో పాటు, రాఘవపూర్ కబ్రస్తాన్లో ప్రహరీ గోడ నిర్మాణం చేస్తామన్నారు.