»A Case Has Been Registered Against Mla Raja Singh And Payal Shankar
BJP MLAs: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, పాయల్ శంకర్ పై కేసు నమోదు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారు.
Rajasingh Hatrik is the BJP candidate in Goshamahal constituency
BJP MLAs: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారు. అలా ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి, ఇద్దరు ఎమ్మెల్యేలపై ఖానాపూర్ పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం రోడ్ షోలో పర్మిషన్ ఇచ్చిన సమయాన్ని మించి ప్రచారం చేసినందుకు బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహేందర్ బీజేపీ మండల పార్టీ కన్వీనర్ లపై వీడియో సర్వేలెన్సు టీం ఇన్చార్జి ఫిర్యాదు చేశారు. దీంతో ఖానాపూర్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి ఖానాపూర్, ఇచ్చోడలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా ఫేక్ వీడియోలు సృష్టించారని ప్రతిపక్ష నాయకులపై ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని విమర్శించారు. వారు అధికారం కోసం ఏమైనా చేస్తారంటూ మండిపడ్డారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని, ప్రజలు కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ వేల కోట్లు మంజూరు చేశారని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని గతంలో హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జరిగినట్టే రేవంత్ రెడ్డికి కూడా జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.