Ram Charan: ఊహించని కాంబో.. రామ్ చరణ్, సూర్య మల్టీస్టారర్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారా? అంటే, కోలీవుడ్ వర్గాల్లో అవుననే చర్చ జరుగుతోంది. మరి ఈ స్టార్ హీరోల కోసం ట్రై చేస్తున్న డైరెక్టర్ ఎవరు? అసలు సాధ్యమేనా?
Unexpected combo.. Ram Charan, Suriya multistarrer?
Ram Charan: పాన్ ఇండియా సినిమాల నేపథ్యంలో.. ప్రస్తుతం ఎలాంటి కాంబినేషన్ అయినా వర్కౌట్ అయ్యేలా ఉంది. కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అంతా టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి, మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక్కోసారి ఊహించని కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయి షాక్ కూడా ఇస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ మూవీని అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్టే చేయలేదు. కానీ ఒక్కసారిగా అనౌన్స్మెంట్తోనే పోయేలా.. ఈ క్రేజీ కాంబో సెట్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబో తెరపైకి వచ్చింది. సూర్య, చరణ్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఆ కాంబినేషన్‌ను ‘కంగువ’ దర్శకుడు శివ సెట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సూర్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో ‘కంగువ’ తెరకెక్కిస్తున్నాడు శివ. ఏకంగా పది భాషల్లో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా తర్వాత సూర్య, చరణ్‌తో మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అవుతున్నాడట శివ. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. కానీ అది అంత ఈజీగా జరిగే పని కాదు. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చరణ్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ ఇద్దరు ఇతర కమిట్మెంట్స్ పక్కకు పెట్టి.. ఓకె చెప్పాలంటే సాలిడ్ సబ్జెక్ట్ కావాలి. అయితే.. ఇలాంటి కాంబోలు సెట్ అవకపోయిన కూడా ఫ్యాన్స్‌కు మాత్రం భలే కిక్ ఇస్తుంటాయి.