SRPT: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, వాహనచోదకులు అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడతాయని డీటీవో సురేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధిక వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, తదితర తప్పుల వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.