SRD: ఖేడ్ పట్టణంలోని నెహ్రూ నగర్ పురాతన వీరాంజనేయ స్వామి ఆలయంలో రేపటి నుంచి శివ పంచాయతన ప్రతిష్ట యాగం మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గురురాజు శర్మ శుక్రవారం తెలిపారు. 3 రోజుల పాటు స్థానిక కాలనీవాసుల ఆధ్వర్యంలో స్మార్త ఆగమ విధానంతో ప్రతిష్ట ఉత్సవ కార్యక్రమం, నవంబర్ 1 నుంచి మూడో తేదీ వరకు సాధుసంతులతో యంత్ర ప్రతిష్ట నిర్వహిస్తామన్నారు.