KMM: ఖమ్మం దానవాయిగూడెంలో ఉన్న జిల్లా కారాగారాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. జిల్లా సబ్ జైల్ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి సబ్ జైల్లో ఉన్న అన్ని బ్లాక్లను పరిశీలించారు. నిరక్షరాస్యులైన ఖైదీలకు వారి సంతకం, అక్షరమాల నేర్పించడం చూసి ప్రశంసించారు. కారాగారం భద్రతకు సంబంధించి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు.