MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు రాసకొండ సంజీవ్ మరోసారి ప్రతిభ చూపి పోటీల్లో బహుమతి సాధించాడు. ఈనెల 1 నుండి 5 వరకు కేడి జాదవ్ ఇండోర్ స్టేడియం ఐజి కాంప్లెక్స్ న్యూఢిల్లీలో జరిగిన ఏడవ వాకో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ రిఫ్రి సెమినార్ లో పాల్గొని సర్టిఫికెట్, అవార్డు పొందారు. అతన్ని గ్రామస్తులు అభినందించారు.