PDPL: పాలకుర్తి మండలంలోని MPDO కార్యాలయం ఆవరణలో 34 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను MRO చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. MLA సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలను పూర్తి చేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు.