SRD: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈనెల 9వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్డు సురక్ష అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.