BDK: గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో శుక్రవారం ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పర్యటించి వోల్టేజీ సమస్య ఉండబోదని వివరించారు. లో వోల్టేజీ సమస్య లేకుండా గుండాల, ఆళ్లపల్లి సబ్స్టేషన్లలో 5 ఎంవీఏ బూస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.