వరంగల్: నగరంలోని ప్రసిద్ధి గల శ్రీ భద్రకాళి దేవాలయంలో ఈరోజు అమ్మవారిని నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకం, అలంకారం, మహానైవేద్యం వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణం భక్తుల నినాదాలతో కిక్కిరిసిపోయింది.