ADB: విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని స్థానిక కొమురంభీం కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన జోనల్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలను ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పేర్కొన్నారు.