SRCL: బోయినపల్లి మండలం కోదురుపాక, చౌరస్తా వద్ద ఆటోమేటిక్ సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ… ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాహనాలు, జిల్లాకు వచ్చే అనుమానిత వాహనాలను గుర్తించేందుకు జిల్లా సరిహద్దుల్లో ఆధునిక ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.