KNR: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ జమ్మికుంటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగ తొలి రోజు ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో మొదలైంది. మహిళలు తంగేడు, గునుగు, బంతి వంటి పూలను జాగ్రత్తగా పేర్చి బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం వాటిని పూజించి, బతుకమ్మ పాటలు పాడుతూ.. ఉత్సాహంగా ఆడిపాడారు.