NLG: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి మొదలైనందున, సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్లు మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు నిరంతరం నిఘా విభాగాలు పనిచేస్తుంటాయని తెలిపారు.