HYD: చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి భాగ్యలక్ష్మి ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18న ప్రారంభమై ఉత్సవాలు 23న ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 18న ధన్ తేరస్ను పురస్కరించుకొని ఉదయం 7 గంటలకు హారతి ప్రారంభమవుతుందన్నారు. 23న భాయి దూజ్ తదితర పూజా కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు.