SRCL: తంగళ్లపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజాపాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పెద్దూరి తిరుపతి, రెడ్డి పర్ష రాములు, మచ్చ శ్రీనివాస్, పాల్గొన్నారు.