ADB: ఈనెల 5వ తేదీన పత్తి కొనుగోళ్లు నిలిపివేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు బుధవారం తెలిపారు. జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సీసీఐ, ప్రైవేట్ వారిచే సైతం కొనుగోలు జరగవని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.