ప్రకాశం: అద్దంకి మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో వరి పంటను గురువారం ఏవో వెంకటకృష్ణ పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. వర్షాలు తగ్గేవరకు కోతలు కోయవద్దని వెంకటకృష్ణ రైతులకు తెలియజేశారు. ప్రస్తుతం నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. పొలంలో నీళ్లు నిలవకుండా గట్లు కొట్టాలని వెంకటకృష్ణ తెలియజేశారు.