SRD : పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఇస్నాపూర్‌కు చెందిన గంగారం రెండో కుమారుడు సుజనకుమార్ (8వ తరగతి) పాఠశాలకు సరిగా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో 22న ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.