NZB: మోపాల్ మండలం మంచిప్పలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు శుక్రవారం గాయపడ్డాడు. సొంత పొలం నుంచి గేదెలను ఇంటికి తీసుకువస్తుండగా ఈ సంఘటన జరిగిందని బాలుడి తండ్రి ఉల్లెంగ్ సాయిలు తెలిపారు. గతంలోనూ పలువురు గ్రామస్తులు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి, కుక్కల బెడదను తగ్గించాలని గ్రామస్తులు కోరుతున్నారు.