KNR: ఎండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాణి లక్ష్మీ బాయి ఆత్మరక్షణ పథకం కింద కరాటే శిక్షణ తరగతులను ప్రారంభించారు. మండల విద్యాధికారి సముద్రాల హరికృష్ణ మాట్లాడుతూ.. కరాటేతో బాలికల్లో ఆత్మస్థైర్యం పెరిగి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.