HNK: ఎంపీ కడియం కావ్య బుధవారం సాయంత్రం సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం తగిన భవనాలను స్వయంగా పరిశీలించారు. హనుమకొండలోని కుడా కార్యాలయం, కాజీపేట డివిజన్ మున్సిపల్ కార్యాలయం, డిఎం హెచ్వో కార్యాలయాలను ఆమె సందర్శించారు. ఈ పరిశీలనలో హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.