MHBD: నేడు జరిగే దసరా పండుగను తొర్రూరు మండల ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ కోరారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… ఎన్నికల కోడ్, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున చట్ట విరుద్ధమైన పనులు, వివాదాస్పద చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.