SDPT: స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా బృందాలు పకడ్బందీగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం సమీకృత కార్యాలయంలో FST, SST, MCC బృందాలకు ఆమె శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 29 నుంచే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.