NLG: చిట్యాలలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు నేడు చివరి రోజుకు చేరుకున్నాయి. 11వ రోజు గురువారం శ్రీరాజరాజేశ్వరి దేవిగా, బంగారు రంగు వస్త్రంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూలు, పులిహోరను ప్రసాదముగా నివేదించారు. దసరా సందర్భంగా ప్రజలు అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో వస్తున్నారు.