KRNL: ఈనెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో చర్చించి, వాహనాల పార్కింగ్, హెలిపాడ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బి క్యాంప్, నంద్యాల చెక్ పోస్ట్ వంటి ప్రదేశాలను ఎస్పీ ప్రత్యక్షంగా పరిశీలించారు.