KRNL: ఆదోనిలో డీఎస్పీ బంగ్లా, ఈఎస్సై ఆసుపత్రి, రైల్వే గేటు మార్గం గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం పడినా నీరు నిలిచి రాకపోకలు కష్టసాధ్యమవుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని బుధవారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఎర్రమట్టి వేయాలని పలు మార్లు కోరినా అధికారులు స్పందించలేదని వారు ఆరోపించారు.