WGL: జిల్లాలో అధిక లాభాల ఆశ చూపి కోట్ల రూపాయలు దోచిన నలుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.92 లక్షలు, 684.5 గ్రాముల బంగారు నాణేలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.