HNK: మాజీ సీఎం కేసీఆర్ను మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బుధవారం కలిశారు. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి ప్రసాదాన్ని, అమ్మవారి వద్ద ఉంచిన పట్టువస్త్రాలను KCRకు వినయ్ భాస్కర్ అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించి పలు అంశాలపై KCRతో ఆయన చర్చించారు.