WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మిమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఆలయ అభివృద్ధి కమిటీ, పూజారులు, వికాస తరంగిణి-సన్నూరు సేవా బృందం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.