PPM: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అనారోగ్యంతో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ బుధవారం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను కోరారు.