ATP: అనంతపురంలోని పాతూరు అమ్మవారి శాలలో నిర్వహించిన దేవీ నవరాత్రుల మహోత్సవ కార్యక్రమంలో MLA ఎంఎస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీ నవరాత్రుల కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆపరేటివ్ ఛైర్మన్ శ్రీ ముంటిమడుగు కేశవరెడ్డి పాల్గొన్నరు.