HYD: విజయదశమి పురస్కరించుకొని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించినట్లు ఆలయ ఫౌండర్ పి. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రముఖ పండితులతో ఆధ్యాత్మిక ఉపన్యాస భక్తి గీతాలు, సంకీర్తనలు ఉంటాయన్నారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో సంగీత దర్శకుడు శివమణి పాల్గొంటారని తెలిపారు.