NGKL: చలి తీవ్రత దృష్ట్యా ఊర్కోండ హెడ్ కానిస్టేబుల్ వెంకోజీ మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఊర్కోండ మండలంలోని ఊర్కోండపేట గ్రామం పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న వృద్ధులకు ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు. పేదలకు ఆపద సమయంలో అండగా నిలుస్తున్న వెంకోజీని మండల ప్రజలు ఈ సందర్భంగా అభినందించారు.