BDK: భద్రాద్రి రామాలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు కవరేజీ కోసం జర్నలిస్టులకు మీడియా పాస్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఉత్సవ విశేషాలను ప్రజలకు చేరవేసే తమకు పాస్లు నిరాకరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉత్సవాల వేళ తమకు ఆటంకం కలగకుండా పాస్లు అందజేయాలన్నారు.