NGKL: నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మంద జగన్నాథ్ దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రావుల మాట్లాడుతూ.. రాజకీయాల్లో అజాతశత్రువుగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయన అందరికీ ఆప్తుడు అని అన్నారు.