TG: మాజీమంత్రి KTR తెలంగాణ భవన్లో కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. ‘కార్మికుల క్యాలెండర్ పోరాటాల క్యాలెండర్ కావాలి. కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర బడ్జెట్లో పెట్టాలి. BRS అధికారాన్ని మాత్రమే కోల్పోయింది.. పోరాట పటిమను కాదు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్’ అని పేర్కొన్నారు.