ASR: అడ్డతీగల మండలం గొండోలు గ్రామానికి చెందిన రాజ్ ప్రణీత్ రాష్ట్ర స్థాయి పోటిల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. 6వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి చెన్నైలో ఇటీవల జరిగిన బాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్ 14 సింగిల్స్ విభాగంలో విన్నర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ ట్రోఫీ, ప్రశంసాపత్రం అందుకున్నాడని పేర్కొన్నారు.