ATP: కుందుర్పి పశు వైద్యశాల ఆవరణలో పశువైద్యాధికారి డా. ప్రసాద్ సమక్షంలో సోమవారం కుసుమగిరి గొర్రెల పెంపకం దార్ల సహకార సంఘం (కమిటీ)ను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శేషాద్రి, ఉపాధ్యక్షులుగా పెద్ద గంగప్పతో పాటు మరో ఐదుగురు డైరెక్టర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి ప్రసాద్ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.