GDL: ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను నిర్వాహకులతో కలిసి విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 3న రథోత్సవం ఉంటుందని తెలిపారు.