SKLM: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలాస మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు రహదారి వంతెన వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు