VZM : మెగా ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం ఉచిత పశు మెగా వైద్య ఆరోగ్య శిబిరంను లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో ఆమె ప్రారంభించారు. ఈ శిబిరాలలో పశువైద్య చికిత్సలు, గర్భ కోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు వంటి అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయన్నారు.