HYD: నగర పోలీసు విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉమెన్ మౌంటెడ్ పోలీస్ నేటి నుంచి అధికారికంగా విధుల్లో రానుంది. నిమజ్జనం నేపథ్యంలో క్రౌడ్ కంట్రోల్ కోసం వీరిని మోహరిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం నుంచి పది మంది మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసిన అధికారులు వీరికి రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు.