ములుగు: ఏటూరునాగారానికి చెందిన స్థానికులు అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్ద తమ వాహనాలకు ఫాస్టాగ్ మినహాయింపూ కోసం వాహన ఆర్సీ, ఆధార్ కార్డ్ అందజేయాలని అటవీశాఖ (దక్షిణం) రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు వివరాలు అందజేయాలని, లేని పక్షంలో వాహనాలకు ఎలాంటి మినహాయింపూ ఉండదని పేర్కొన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.